ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి..
ABN , Publish Date - Oct 31 , 2026 | 07:24 AM
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగోల్‌పురి పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగోల్‌పురి పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 20 ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు (Delhi Factory Fire).
శుక్రవారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో మంగోల్‌పురి ఇండస్ట్రియల్ ఏరియా ఫేజ్-1లోని బి-293/294 వద్ద ఉన్న ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న ఆరుగురిని సహాయక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. వారిని వెంటనే సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు (Mangolpuri Factory Fire).
ఫ్యాక్టరీ బేస్‌మెంట్‌లో మొదట మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది (Delhi Fire Accident 2026). భవనంలో దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. ఒకరిని మూడో అంతస్తులోని మెట్ల మార్గం నుంచి, మరో ఐదుగురిని నాలుగో అంతస్తు నుంచి బయటకు తీసుకొచ్చారు. సుమారు 20 అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేసేందుకు పనిచేశాయి. ఈ ఫ్యాక్టరీలో పాదరక్షల తయారీ, నిల్వ కార్యకలాపాలు జరుగుతున్నాయి. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారనే విషయంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?