వంటలు: స్పైసీ చికెన్ వేపుడు
ABN , Publish Date - Nov 01 , 2026 | 12:45 PM
స్పైసీ చికెన్ వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు : చికెన్ - 500 గ్రా., ఉల్లిగడ్డ - 1, పెరుగు : ఒక టీస్పూన్, మిరియాలు - పావు టీస్పూన్, లవంగాలు - 4.
కావాల్సిన పదార్థాలు : చికెన్ - 500 గ్రా., ఉల్లిగడ్డ - 1, పెరుగు : ఒక టీస్పూన్, మిరియాలు - పావు టీస్పూన్, లవంగాలు - 4, దాల్చిన చెక్క- ఒక ఇంచు ముక్క, యాలకులు - 3, నిమ్మకాయ- 1, కొత్తిమీర- ఒక కట్ట, పసుపు - పావు టీస్పూన్, కరివేపాకు - ఒక రెమ్మ, కారం - ఒక టేబుల్ స్పూన్, నూనె, ఉప్పు - తగినంత.
తయారీ
విధానం : చికెన్‌ని కడిగి ఉప్పు, అర చెక్క నిమ్మకాయ రసం పిండి గంటపాటు మారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, యాలకులు వేసి వేయించాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇవి వేగాక.. అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత చికెన్ వేసి కలిపి మూత పెట్టేయాలి. ముక్క తెల్లగా అయ్యేవరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు పెరుగు వేసి పది నిమిషాల పాటు ముక్క ఉడకనివ్వాలి. చికెన్ సగానికి పైగా ఉడికిన తర్వాత కారం, ఉప్పు, ముందుగా చేసుకున్న మసాలా వేసి ముక్క చిదిమిపోకుండా కలిపి మూత పెట్టాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News