Share News

ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్.. దక్షిణ కోస్తా జిల్లాలకు హై అలర్ట్

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:33 PM

ఏపీకి తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుఫాన్‌గా మారి ఏపీ వైపునకు దూసుకొస్తోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాన్.. దక్షిణ కోస్తా జిల్లాలకు హై అలర్ట్
cyclone alert for ap

అమరావతి, నవంబర్ 1: ఏపీకి మరో తుఫాన్ రానుంది. వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడగా.. ఇది తుఫాన్‌గా మారి ఏపీ వైపు పయనిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని.. ఈ మేరకు దక్షిణ కోస్తా జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించినట్లు వెల్లడించింది.


ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడగా.. రానున్న 6 గంటల్లో తుపానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. రేపటికి (సోమవారం) తీవ్ర తుపానుగా మారే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. ఈ తీవ్ర తుపాను నెల్లూరు, నరసాపురం మధ్య ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశాలున్నట్లు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీట్‌రూటు మారుతోంది!

అడవిలో కార్పొరేట్ పాఠాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 12:50 PM