మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ABN , Publish Date - Nov 03 , 2026 | 09:19 AM
‘మురసు’ తీవ్ర తుఫాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. వివిధ రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. అలాగే పలు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది.
విశాఖపట్నం, నవంబర్ 03: ‘మురసు’ తీవ్ర తుఫాన్ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించింది. వివిధ రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. అలాగే పలు రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ జాబితాలో ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయని వివరించింది. తుఫాన్ ఈదురు గాలుల వల్ల కారవడి వద్ద పలు రైళ్లు నిలిపివేసినట్లు చెప్పింది. ప్రయాణానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌లో రైలు స్థితి చూసుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విశాఖపట్నంలోని దక్షిణ కోస్తా రైల్వే కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ తుఫాన్ ప్రభావంతో విజయవాడ – గూడూరు మార్గంలో పలు రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేత..
పలు రైళ్లు రద్దు..
బిట్రగుంట - విజయవాడ (67260),
విజయవాడ - గూడూరు (17260),
గూడూరు - రేణిగుంట (67203),
రేణిగుంట - నెల్లూరు (67204)
నెల్లూరు - విజయవాడ (17259)
విజయవాడ - నరసాపురం (67258)
నరసాపురం - రాజమండ్రి (67246)
సమయం మార్పు (రీషెడ్యూల్)..
విజయవాడ – చెన్నై సెంట్రల్ మధ్య నడిచే ‘పినాకిని ఎక్స్‌ప్రెస్’ (12711) ఆలస్యంగా నడుస్తుంది.
ఈ రైలు ఉదయం 8:10 గంటలకు బయలుదేరింది. అసలు అయితే ఉదయం 6.10 గంటలకు బయలుదేరాల్సి ఉంది. 2 గంటల ఆలస్యంగా విజయవాడ నుంచి పినాకిని ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది.
పలు రైళ్లు దారి మళ్లింపు..
కేరళ ఎక్స్‌ప్రెస్ (12625)
బెంగళూరు - హతియా (18638)
హౌరా - బెంగళూరు (22863)
కాన్పూర్ - బెంగళూరు (04131)
ఈ రైళ్లు రేణిగుంట- ఎర్రగుంట్ల-నంద్యాల-గుంటూరు మీదుగా మళ్లింపు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాతబస్తీలో యువకుడి హత్య.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
6, 7 తేదీల్లో చర్లపల్లి-చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లు
For More AP News and Telugu News