Share News

మద్యం స్కామ్ కేసులో అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణ

ABN , Publish Date - Nov 03 , 2026 | 10:28 AM

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.

మద్యం స్కామ్ కేసులో అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. రేపు విచారణ
Ambati Rambabu

అమరావతి, నవంబర్ 3: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. రేపు(బుధవారం) విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. మద్యం అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో నోటీసులు ఇవ్వగా తన ఆరోగ్యం బాగోలేదంటూ అంబటి రాంబాబు లేఖ పంపిన విషయం తెలిసిందే. ఆ తరువాత తన గుండెకు స్టంట్‌లు వేయడంతో ఆ ఆసుపత్రి ఇచ్చిన నివేదికను ఈడీ అధికారులకు పంపించారు.


గత నెల 29, ఈనెల 4వ తేదీల్లో విచారణకు రావాల్సిందిగా అంబటిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెయిల్‌లో కోరారు. అయితే తాను మెయిల్ చేసుకోలేదని మాజీ మంత్రి చెప్పడంతో.. తిరిగి నోటీసులు పంపించారు. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొనగా.. అంబటి రాంబాబు కూడా విచారణ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

మురసు తుఫాన్ నష్టంపై అమిత్ షా ఫోన్.. కేంద్ర సాయం కోరిన సీఎం చంద్రబాబు

ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. 7 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 11:01 AM