Share News

ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. 7 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన

ABN , Publish Date - Nov 03 , 2026 | 09:54 AM

మురసు తుఫాన్‌తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. తుఫాన్ ప్రభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు.

ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. 7 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన
Heavy rains

అమరావతి, నవంబర్ 3: మురసు తుఫాన్‌తో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.


రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలపై అధిక ప్రభావం ఉండనుంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తూర్పుగోదావరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాత్రి 10 గంటల నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు ప్రకాశం జిల్లా కొత్తపట్నం ప్రాంతంలో అత్యధికంగా 164.25 మి.మీ. వర్షపాతం నమోదైంది.


నిన్న ఉదయం 8.30 నుంచి ఈరోజు ఉదయం 5 గంటల వరకు వర్షపాతం వివరాలు

  • బాపట్ల జిల్లాలో అత్యధికంగా 40.02 మి.మీ. వర్షపాతం నమోదు.

  • ప్రకాశం జిల్లాలో 26.56 మి.మీ.

  • పశ్చిమగోదావరి జిల్లాలో 23.36 మి.మీ.

  • కృష్ణా జిల్లాలో 23.15 మి.మీ. వర్షపాతం నమోదు

  • గుంటూరు జిల్లాలో 19.09 మి.మీ.

  • శ్రీకాకుళం జిల్లాలో 18.30 మి.మీ.

  • డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 14.47 మి.మీ. వర్షపాతం నమోదు

  • తిరుపతి జిల్లాలో 12.37 మి.మీ.

  • కాకినాడ జిల్లాలో 11.72 మి.మీ. వర్షపాతం నమోదు

  • ప్రకాశం జిల్లా ఎన్జీ పాడులో 114.19 మి.మీ.

  • బాపట్ల జిల్లా చీరాలలో 99.59 మి.మీ

  • ప్రకాశం జిల్లా త్రోవగుంటలో 91.95 వర్షపాతం నమోదైంది

  • పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 79.34 మి.మీ

  • డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురంలో 74.75 మి.మీ. వర్షపాతం నమోదు


ఇవి కూడా చదవండి..

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలో పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు

మురసు తుఫాన్ నష్టంపై అమిత్ షా ఫోన్.. కేంద్ర సాయం కోరిన సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 09:55 AM