కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తున్న ఉల్లి
ABN , Publish Date - Nov 03 , 2026 | 09:41 AM
ఉల్లి ఘాటెక్కుతోంది. కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తోంది. ఉల్లి లేకుండా ఏ కూర కూడా వండలేని పరిస్థితి. కిలో ఉల్లిగడ్డ రూ. 60నుంచి రూ. 70లకు కొనాలంటే మధ్యతర గతి ప్రజలకు భారంగా మారింది.
పెరుగుతున్న ధర
మధ్యతరగతికి భారం
హైదరాబాద్: ఉల్లి ఘాటెక్కుతోంది. కొయ్యకుండానే కళ్లవెంట నీరు తెప్పిస్తోంది. ఉల్లి లేకుండా ఏ కూర కూడా వండలేని పరిస్థితి. కిలో ఉల్లిగడ్డ రూ. 60నుంచి రూ. 70లకు కొనాలంటే మధ్యతర గతి ప్రజలకు భారంగా మారింది. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఉల్లిగడ్డ ధర పెరుగుతుండడంతో పేద ప్రజలు కొనలేదని పరిస్థితి నెలకొంది. చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న కుటుంబాలకు ఏ వస్తువు కొనాలన్న భారంగా మారింది. రైతుబజార్‌లలో ఉల్లి గడ్డ ధర కిలో రూ. 40ఉండడంతో ఫలకనుమా, గౌలిపురా, లాల్ దర్వాజ, చాంద్రాయణగుట్ట బహిరంగ మార్కెట్లలో రూ. 50 నుంచి రూ. 60 వరకు విక్రయిస్తున్నా రు. దీంతో ఉల్లిగడ్డ కొనాలంటేనే మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. చిన్న సైజ్, నాణ్యత తక్కువ ఉన్న గడ్డను రూ. 50 నుంచి రూ.55కు విక్రయించగా, పెద్ద సైజ్ ఉల్లి గడ్డను రూ. 60కి విక్రయిస్తున్నారు.
ఎల్ నినో ప్రభావమేనా..
ఎల్ నినో కారణంగా వర్షాలు లేక పంటలు పండకపోవడంతో నిత్యావసర సరుకులు ఉల్లిపాయ, కూరగాయలు కొనలేదని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూపించడంలో విఫలమైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హోటళ్లలో ప్యాజ్ నహీ
ఉల్లిగడ్డ ధర పెరగడంతో ఫాస్ట్ ఫుడ్, హోటళ్లు, రెస్టారెంట్లలో ఉల్లిపాయ ముక్కలే కనిపించడం లేదు. బిర్యానీ ప్రియులు బిర్యానీ ఆర్డర్ చేసినా కేవలం కీరా ముక్కలు అడిగితే తప్ప నిమ్మకాయతో సరిపెడు తున్నారు. ఉల్లిపాయ ఉంటేనే బిర్యానీకి రుచి ఉంటుందని బిర్యానీ ప్రియులు అంటున్నారు.
మూడు నెలలుగా పెరుగుతున్న ధర
మూడు నెలలుగా ఉల్లిగడ్డ ధర రూ. 60కి పెరిగిపోయింది. దీంతో మూడు నెలల నుంచి ఉల్లిగడ్డలు కొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించి కొనుగోలు చేస్తున్నారు. కిరాణషాపులలో మాత్రం ఉల్లిగడ్డను రూ. 60 చొప్పున విక్రయిస్తున్నారు. ఉల్లి ధర పెరగడం గమనించిన కొందరు ప్రజలు ముందుగానే అధిక మొత్తంలో కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ ఉంచుకొని జాగ్రత్త పడ్డారు. గతంలో కూడా ఉల్లి ధర పెరిగినప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్పందించి రైతుబజార్‌లలో సబ్సిడీ కేంద్రాలు ఏర్పాటు చేసి తక్కువ ధరకు ఉల్లి అందించారు. ఈ సంవత్సరంలో ప్రభు త్వం ఇంతవరకు సబ్సిడీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని వాపోతున్నారు.
విక్రయాలు తగ్గించాం
నాన్ వెజ్ వంటకాల్లో రుచి ఉండాలంటే ఉల్లిపాయ తప్పనిసరి. ధరలు రూ. 20 నుంచి రూ. 30 ఉన్న సమయంలో ప్రతి రోజూ సుమారు 5 నుంచి 10 కిలోల వరకు కొనుగోలు చేశాం. తాజాగా రూ.60 కావడంతో కేవలం రెండు కిలోలు కొనుగోలు చేసి సరి పెడ్తున్నాం.
తోట విక్రమ్, ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకుడు
ఈ వార్తలు కూడా చదవండి:
వీకెండ్ పార్టీ కేసులో.. 7కు చేరిన గంజాయి పాజిటివ్‌లు
అన్నా.. మా కూతురి పెళ్లి రిసెప్షన్‌కు రండి
Read Latest AP News And Telangana News And International News And Telugu News