త్రిపురలో బీఎస్ఎఫ్ జవాన్లపై దాడి.. సీఎం మాణిక్ సాహా ఆగ్రహం
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:52 AM
త్రిపురలో ఘోరం జరిగింది. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లపై స్మగ్లర్లు దాడి చేశారు. బోక్సానగర్ పరిధిలోని ఆశబరిలో సోమవారం ఉదయం ఈ దాడి జరిగింది. దాడిలో గాయపడిన జవాన్ల వద్ద నుంచి స్మగ్లర్లు తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారు.
ఇంటర్నెట్ డెస్క్: త్రిపురలో ఘోరం జరిగింది. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లపై స్మగ్లర్లు దాడి చేశారు. బోక్సానగర్ పరిధిలోని ఆశబరిలో సోమవారం ఉదయం ఈ దాడి జరిగింది. దాడిలో గాయపడిన జవాన్ల వద్ద నుంచి స్మగ్లర్లు తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా ప్రభుత్వ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపుఉద్రిక్తత నెలకొంది. జవాన్లపై జరిగిన దాడిని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఎక్స్‌లో తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. దేశ భద్రత కోసం పనిచేస్తున్న జవాన్లపై దాడి ఏమాత్రం సహించరానిదని ఆయన పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
దాడికి పాల్పడిన వారిని త్వరగా గుర్తించి, వెంటనే పట్టుకోవాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. మన భద్రతా సిబ్బందిపై దాడి చాలా ఆందోళనకరమని చెప్పారు. జవాన్లకు తగిన గౌరవం, రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం స్పష్టం చేశారు. కాగా.. జవాన్లపై దాడికి పాల్పడిన దుండగుల్లో ఒకడిని బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడిని హెఫ్జుర్ రహమాన్‌గా గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి