Share News

‘విదేశీ సాయం’పై బహిరంగ చర్చకు సిద్ధమా?

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:43 AM

దేశాన్ని అస్థిరపరచడానికి ప్రతిపక్షాలు ‘విదేశీ సాయాన్ని’ తీసుకుంటున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు.

‘విదేశీ సాయం’పై బహిరంగ చర్చకు సిద్ధమా?
Rahul Gandhi

  • ప్రధాని మోదీకి రాహుల్‌ గాంధీ సవాల్‌

న్యూఢిల్లీ, నవంబరు 2: దేశాన్ని అస్థిరపరచడానికి ప్రతిపక్షాలు ‘విదేశీ సాయాన్ని’ తీసుకుంటున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యను కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తిప్పికొట్టారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. ‘విదేశీ సాయం’తోనే మోదీ ప్రధాని గద్దెపై ఉన్నారని రాహుల్‌ ఆరోపించారు. ‘‘దేశానికి అబద్ధాలు చెప్పడం మానండి. విదేశీ సాయంతోనే మీరు ప్రధాని అయ్యారు. మీ నిధులు మొత్తం విదేశీయుల సాయంతో వచ్చినవే’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 03 , 2026 | 07:44 AM