Share News

ఫాలోయర్లు లక్షల్లో.. వచ్చిన ఓట్లు పదుల్లో

ABN , Publish Date - Nov 03 , 2026 | 07:35 AM

సోషల్‌ మీడియాలో పోస్టులకు వ్యూస్‌, లైకులు భారీగా వస్తున్నాయని.. ఫాలోయర్లు దండిగా ఉన్నారని పొంగిపోయి అదే ప్రజాభిమానం అనుకొని కాలర్‌ ఎగరేస్తే గర్వభంగం తప్పదేమో!

ఫాలోయర్లు లక్షల్లో.. వచ్చిన ఓట్లు పదుల్లో
elections

  • రాజస్థాన్‌ సర్పంచ్‌ ఎన్నికల్లో ఇద్దరు సోషల్‌ మీడియా

  • ఇన్‌ఫ్లూయన్సర్లకు చేదు అనుభవం

న్యూఢిల్లీ, నవంబరు 2: సోషల్‌ మీడియాలో పోస్టులకు వ్యూస్‌, లైకులు భారీగా వస్తున్నాయని.. ఫాలోయర్లు దండిగా ఉన్నారని పొంగిపోయి అదే ప్రజాభిమానం అనుకొని కాలర్‌ ఎగరేస్తే గర్వభంగం తప్పదేమో! ఇందుకు రాజస్థాన్‌ సర్పంచ్‌ ఎన్నికల్లో ఇద్దరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఎదురైన ఘోర పరాజయమే ఉదాహరణ. జోధ్‌పూర్‌ జిల్లా ఇండోస్‌ కీ థానీ-2 గ్రామానికి చెందిన ఓం ప్రకాశ్‌ బిష్ణోయ్‌ ప్రముఖ జ్యోతిష్యుడు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14లక్షల మంది, సోషల్‌ మీడియాలో 2.32లక్షల మంది ఫాలోయర్లున్నారు. అయితే ఆయన తన సొంత గ్రామంలో సర్పంచ్‌ పదవికి పోటీ చేయగా 33 ఓట్లు మాత్రమే పడ్డాయి. వీటిలో 11 ఓట్లు ఆయన కుటుంబసభ్యులవే! నోటాకు 10 ఓట్లుపడ్డాయి. ఇక పవన్‌ సాహూ అనే వ్యక్తి ఫిట్‌నెస్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో బాగా ఆదరణ పొందారు. ఆయనకు యూట్యూబ్‌లో 2.77 కోట్ల మంది సబ్‌స్ర్కైబర్లు, ఇన్‌స్టాలో 70 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. పవన్‌ సాహూ భార్య కోమల్‌ సాహూ రాజస్థాన్‌ బిల్వారా జిల్లాలో పుటియా కుర్ద్‌ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేశారు. భార్య తరఫున పవన్‌ సాహూ ఊర్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. అయినా కోమల్‌ 277 ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచారు.

ఈ వార్తలు కూడా చదవండి..

లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే

ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి

Updated Date - Nov 03 , 2026 | 07:35 AM