Share News

ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. తుపానుతో పలు చోట్ల వాయిదా

ABN , Publish Date - Nov 03 , 2026 | 08:19 AM

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు( మంగళవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కాగా.. తుపాను ప్రభావంతో పలు చోట్ల కౌంటింగ్ వాయిదా పడింది.

ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. తుపానుతో పలు చోట్ల వాయిదా
municipal election counting started in ap

అమరావతి, నవంబర్ 3: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 92 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఓట్లను లెక్కించనున్నారు. ఇందులో భాగంగా 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, 3,186 వార్డులకు సంబంధించి ఓట్లను లెక్కిస్తారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా 138 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. కౌంటింగ్ ప్రక్రియలో 47, 817 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.


కౌంటింగ్‌పై తుపాను ప్రభావం

రాష్ట్రంలో కొనసాగుతున్న మురసు తుపాను ప్రభావం కౌంటింగ్‌పై పడింది. భారీ వర్షాల కారణంగా ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ వాయిదా పడింది. ఈ మేరకు కౌంటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తుపాను ప్రభావం తగ్గిన తరువాత కౌంటింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా.. భారీ వర్షాల కారణంగా చీరాలలో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ మేరకు కౌంటింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుందని సంబంధిత అధికారులు ప్రకటించారు. విజయవాడలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోలేదు. దీంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభవుతుందని అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలనూ చదవండి:

త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి

Updated Date - Nov 03 , 2026 | 08:34 AM