Share News

మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు

ABN , Publish Date - Nov 03 , 2026 | 08:17 PM

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపుగా మాత్రమే కాకుండా, తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

మున్సిపల్ ఎన్నికల్లో  కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు
AP Minister Nara Lokesh

అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపుగా మాత్రమే కాకుండా, తమపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లుగా ప్రజాప్రభుత్వం సుపరిపాలనకు ప్రజలు అందించిన ఆశీర్వాదంగా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా చేసిన కృషికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయని.. ఇక అందరి దృష్టి ప్రజాసేవపైనే ఉండాలని అన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సేవలందించాలని సూచించారు.


ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మన ముందున్న అసలైన బాధ్యత అని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు మరింత వినయంతో, మరింత బాధ్యతతో పనిచేయాలనే సంకల్పాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. ప్రజాసేవ, రాష్ట్ర ప్రగతి ప్రజాప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. 29 రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే నియంత్రణ

తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. వర్షపాతం లోటు తగ్గిందన్న అధికారులు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 08:38 PM