సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టులో కీలక విచారణ
ABN , Publish Date - Nov 05 , 2026 | 08:28 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసుల్లో సీబీఐ విచారణ జరపాలని వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.
అమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న కేసుల్లో సీబీఐ విచారణ జరపాలని వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఈరోజు (గురువారం) విచారణ జరిగింది. పాత్రికేయుడు బాలగంగాధర్ తిలక్, స్కిల్ కేసును సీబీఐకు అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమారు వేసిన పిల్‌పై హైకోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వినిపించారు. సీఎంను, ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాలు చేయాలని సీబీఐ దర్యాప్తును కోరుతున్నారని రోహత్గీ వాదనలు వినిపించారు.
కనీస ఆధారాలు లేకుండా ప్రజాహిత వ్యాజ్యం వేశారని తెలిపారు. తాము విచారించదగిన కేసులు కావని సీబీఐ, ఈడీ అఫిడవిట్‌లు వేశాయని ప్రస్తావించారు. ఆధారాలు లేవంటూ సిట్ ఏసీబీ కోర్టులో తుది నివేదిక జారీ చేసిందని పేర్కొన్నారు. వాటిని ఆమోదిస్తూ ఏసీబీ కోర్టు కేసులను మూసివేసిందని తెలిపారు.
ఈ పిల్‌ను నిరర్ధకమైనదిగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని ముకుల్ రోహత్గీ కోరారు. ఖర్చులు విధించి ఈ పిల్‌ను కొట్టివేయాలని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. హైకోర్టులో ఇరువైపుల వాదనలు ముగిసిన అనంతరం.. ఈ కేసుల వివరాలను పట్టిక రూపంలో ఉంచాలని సీఐడీకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణను మంగళవారానికి వాయిదా ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.