Share News

జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు

ABN , Publish Date - Nov 07 , 2026 | 08:05 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎన్ని విధ్వంసాలు సృష్టించిన ప్రజలు కూటమి పార్టీలకే జై కొట్టారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. జగన్ చొక్కామడతా పెడతామంటే బయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరనే విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు.

జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు
TDP AP President Palla Srinivasa Rao

అమరావతి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎన్ని విధ్వంసాలు సృష్టించిన ప్రజలు కూటమి పార్టీలకే జై కొట్టారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (TDP AP President Palla Srinivasa Rao) వ్యాఖ్యానించారు. జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరనే విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. పట్టణం నుంచి పల్లె వరకు కూటమి సుపరిపాలనకు ప్రజలు పట్టంకట్టారని పేర్కొన్నారు. కూటమి ఘన విజయానికి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు (శనివారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. ఇది కేవలం ఎన్నికల విజయమే కాదని.. కూటమి సుపరిపాలనపై ప్రజలకు ఉన్న నమ్మకమని ఉద్ఘాటించారు.


జగన్ చేసిన విధ్వంసం ఇంకా చెరగని ముద్రగానే ఉంది..

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టానికి, ప్రజల నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని పల్లా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఎన్నికల విధానంపై జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు 2 కోట్ల 60లక్షల ఓటర్లను అవమానానికి గురిచేసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి చేసిన విధ్వంసం ఇంకా చెరగని ముద్రగానే ఉందని విషయాన్ని.. ఈ విజయమే తెలియజేస్తుందని అన్నారు. జగన్ ఎన్ని అబద్ధాలు, విధ్వంసాలు సృష్టించిన ప్రజలు అభివృద్ధి వైపే మొగ్గు చూపారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో 2029 ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం పాలనపై మరింత బాధ్యతను పెంచిందని వెల్లడించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయడం జగన్‌కు బాగా అలవాటేనని ఎద్దేవా చేశారు. ఈవీఎంలు అయినా, బ్యాలెట్ బాక్సులు అయినా ప్రజలు కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు

ఏపీ విపత్తు నిర్వహణ భేష్.. ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ప్రశంసలు

పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 08:25 PM