ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కేకు బర్త్ డే విషెస్ తెలిపిన మంత్రులు
ABN , Publish Date - Jun 20 , 2026 | 05:21 PM
ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో ఆర్కే చేసిన సేవలను గుర్తుచేస్తూ నేతలు ప్రశంసలు కురిపించారు.
అమరావతి, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ (Vemuri Radhakrishna) జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో ఆర్కే చేసిన సేవలను గుర్తుచేస్తూ నేతలు ప్రశంసలు కురిపించారు.
సమాజ హితం కోసం ఆర్కే నిలబడ్డారు: మంత్రి అచ్చెన్నాయుడు
‘నాలుగు దశాబ్దాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం, సమాజ హితం కోసం నిలబడి, నిజాలను నిర్భయంగా ప్రజల ముందుంచుతున్న ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్, వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఎంతటి సవాళ్లు ఎదురైనా బెదరకుండా, ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ న్యూస్ చానల్ ద్వారా ప్రజల పక్షాన నిలబడిన నిఖార్సైన జర్నలిజం ఆయనది. 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే', 'కొత్తపలుకు' వేదికల ద్వారా సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై సమాజాన్ని చైతన్యపరుస్తున్న రాధాకృష్ణ గారి ప్రస్థానం ఎందరికో ఆదర్శం. ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని, భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మీడియా రంగంలో ఆర్కే ప్రత్యేక ముద్ర వేశారు: మంత్రి కొలుసు పార్థసారథి
వేమూరి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో ఆర్కే ప్రత్యేక ముద్ర వేశారని, ప్రజా సమస్యలపై ఆయన చూపిన నిబద్ధత ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆర్కే మరింత సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు మంత్రి కొలుసు పార్థసారథి.
రాధాకృష్ణ చేసిన విశ్లేషణలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయి: పల్లా శ్రీనివాసరావు

వేమూరి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిర్భయ జర్నలిజం, సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై ఆయన చేసిన విశ్లేషణలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. ఆర్కేకు ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని ఆకాంక్షించారు పల్లా శ్రీనివాసరావు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్
వీకెండ్‌లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News