Share News

రైతు బీమా నిలిపివేశామన్న ప్రచారం పూర్తిగా అసత్యం: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Jun 18 , 2026 | 07:50 PM

రైతు బీమా నిలిపివేశామన్న ప్రచారం పూర్తిగా అసత్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎల్‌ఐసీకి రూ.1,359.56 కోట్ల వార్షిక ప్రీమియం పూర్తిగా చెల్లిస్తున్నామని తెలిపారు.

రైతు బీమా నిలిపివేశామన్న ప్రచారం పూర్తిగా అసత్యం: మంత్రి తుమ్మల
Minister Thummala Nageswara Rao

హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): రైతు బీమా నిలిపివేశామన్న ప్రచారం పూర్తిగా అసత్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) పేర్కొన్నారు. ఎల్‌ఐసీకి రూ.1,359.56 కోట్ల వార్షిక ప్రీమియం పూర్తిగా చెల్లిస్తున్నామని తెలిపారు. ఈరోజు (గురువారం) సచివాలయంలో మీడియాతో మంత్రి తుమ్మల మాట్లాడారు. రైతు బీమా ద్వారా రెండున్నరేళ్లలో 66,038 రైతు కుటుంబాలకు లబ్ధిచేకూర్చామని వివరించారు. రైతు బీమా కింద రూ.3,301.90 కోట్ల సాయం విడుదల చేశామని స్పష్టం చేశారు. 2025-26లో 42.16 లక్షల మంది రైతులు రైతు బీమాలో నమోదు చేసుకున్నారని అన్నారు. 20,087 కుటుంబాలకు రూ.1,004.35 కోట్ల బీమా సహాయం చేస్తామని వెల్లడించారు. రైతు సంక్షేమ పథకాలు నిలిపివేసిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదని చెప్పారు.


రైతులకు ఉపయోగపడే ఏ పథకాన్నీ నిలిపివేయలేదు..

ఆపేసిన పథకాలను పునరుద్ధరిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని మంత్రి తుమ్మల అన్నారు. రైతులకు ఉపయోగపడే ఏ పథకాన్నీ నిలిపివేయలేదని చెప్పారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని పేర్కొన్నారు. రామగుండం ఎరువులు పొందేలా కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమిస్తామని వ్యాఖ్యానించారు. ప్రతి నెల రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇస్తామని అన్నారని.. కానీ హామీ ఇచ్చిన మేరకు కేంద్రం యూరియా సరఫరా ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి సరిపడా యూరియా తెలంగాణకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామని పేర్కొన్నారు.


తొలకరి వర్షానికే విత్తనాలు వేస్తే రైతులు నష్టపోతారు..

కేంద్రం ఎంఎస్పీ ప్రకటించి కొనుగోలు నుంచి తప్పుకుంటుందని మంత్రి తుమ్మల విమర్శించారు. ఒక్క గింజ మొక్కజొన్నని కూడా కేంద్రప్రభుత్వం ఎందుకు కొనలేదని నిలదీశారు. ఈ విషయాన్ని తెలంగాణ రైతాంగంపై కక్ష అనుకోవాలా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్తామని స్పష్టం చేశారు. తొలకరి వర్షానికే విత్తనాలు వేస్తే రైతులు నష్టపోతారని చెప్పారు. రెండుసార్లు వర్షం పడితేనే సరిపడా తడి వస్తుందని.. అన్నదాతలు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క

అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 18 , 2026 | 09:12 PM