Share News

రౌడీయిజాన్ని ప్రదర్శించడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారింది: మంత్రి సుభాశ్

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:56 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో గొడ్డలి పార్టీ శ్రేణులు బస్సులు అడ్డుపెట్టి, సైలెన్సర్లు తొలగించి బలప్రదర్శన చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించాయని ధ్వజమెత్తారు.

రౌడీయిజాన్ని ప్రదర్శించడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారింది: మంత్రి సుభాశ్
AP Minister Subhash

అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాశ్ (AP Minister Subhash) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటనలో గొడ్డలి పార్టీ శ్రేణులు బస్సులు అడ్డుపెట్టి, సైలెన్సర్లు తొలగించి బలప్రదర్శన చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించాయని ధ్వజమెత్తారు. రౌడీయిజాన్ని ప్రదర్శించడం వైసీపీ రాజకీయ సంస్కృతిగా మారిందని ఎద్దేవా చేశారు. ఈరోజు (బుధవారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి సుభాశ్ మాట్లాడారు. పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు లేదని చెప్పుకొచ్చారు.


28.9 మిలియన్ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకును కొనుగోలు చేశాం..

వైసీపీ హయాంలో కేవలం 12.9 మిలియన్ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు జరిగిందని మంత్రి సుభాశ్ ప్రస్తావించారు. తమ ప్రభుత్వం 28.9 మిలియన్ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకును కొనుగోలు చేసి రైతులకు మద్దతుగా నిలిచిందని తెలిపారు. పొగాకు కొనుగోళ్ల ద్వారా రైతులకు సుమారు రూ.270 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని తమ ప్రభుత్వం కల్పించిందని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల పతనం, యుద్ధ పరిస్థితులు వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని చెప్పుకొచ్చారు.


రూ.100 కోట్ల భారాన్ని మా సర్కార్ భరిస్తోంది..

కిలోకు రూ.10 ప్రోత్సాహక సాయం అందిస్తూ తమ ప్రభుత్వం సుమారు రూ.100 కోట్ల భారాన్ని భరిస్తోందని మంత్రి సుభాశ్ తెలిపారు. రైతులకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలు అందించే అంశంపై కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతుంటే, జగన్ మాత్రం బలప్రదర్శనలు, రాజకీయ ఆరోపణలకే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రచారానికే గొడ్డలి పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సుభాశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


వార్తలు కూడా చదవండి...

అమరావతి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు.. ఆ ల్యాండ్స్‌ను మానిటైజ్ చేస్తాం: సీఎం చంద్రబాబు

జల్ జీవన్ పనుల్లో వేగం పెంచాలి: పవన్ కల్యాణ్

లోకేశ్ ఎందుకు రాజీనామా చేయాలి.. వైసీపీపై మంత్రి అనగాని ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 04:45 PM