రెడ్ బుక్ సమాజ బాగు కోసమే: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Apr 14 , 2026 | 08:40 PM
తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనే మన మార్గమని తెలిపారు.
అమరావతి, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబుల ఆశయ సాధనే మన మార్గమని తెలిపారు. రెడ్ బుక్ సమాజ బాగు కోసమేనని ఉద్ఘాటించారు. రాజారెడ్డి రాజ్యాంగం పేరుతో ఏపీలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విధ్వంసం సృష్టించారని ధ్వజమెత్తారు. టీడీపీ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించి.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. ఈ రోజు(మంగళవారం) మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో లోకేశ్ సమావేశమయ్యారు. ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జిలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
సిద్ధాంతాలే నాయకత్వానికి బలం..
సిద్ధాంతాలే నాయకత్వానికి బలమని ఈ సందర్భంగా లోకేశ్ ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న పార్టీ సిద్ధాంతాలను కూడా ప్రజలకు వివరించడం అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. కార్యకర్తల మధ్య ఐక్యత, క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. సిద్ధాంతాలపై ఆధారపడి ప్రజల్లో విశ్వాసం పెంచుకుంటేనే దీర్ఘకాలిక రాజకీయ విజయాలు సాధ్యమవుతాయని వివరించారు. సిద్ధాంతపరంగా ఎదిగిన నాయకత్వమే పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని తెలిపారు. ఎన్ని పనులున్నా సీఎం చంద్రబాబు, తాను ప్రతి వారం ఏదో ఒకరోజు పార్టీ కార్యాలయంలో గడుపుతూ ప్రజా సమస్యలను వింటూ.. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
ఆరు ముఖ్య సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త ప్రత్యేక సమయం కేటాయించాలని మంత్రి లోకేశ్ సూచించారు. పార్టీ ప్రవేశపెట్టిన 6 ముఖ్య సిద్ధాంతాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించాలని పేర్కొన్నారు. గతంలో దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై, చంద్రబాబు ఇంటిపై, టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దాడులు చేశారని ఆగ్రహించారు. కార్యకర్తలను హింసించారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దమనకాండకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. అమర్‌నాథ్ గౌడ్, అబ్దుల్ సలాం, తోట చంద్రయ్యలను వెంటాడి మరీ చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి మరణానికి కారకులయ్యారు..
డా.సుధాకర్, కోడెల శివప్రసాద్, మిస్బాలను వేధించి.. వారి మరణానికి జగన్ అండ్ కో కారకులయ్యారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసం, దాడులు, హత్యలు, అవినీతితో జగన్ సమూహం చెలరేగిపోయిందని ఫైర్ అయ్యారు. అధికారం పోయాక కూటమి ప్రభుత్వంపై విషప్రచారాలతో విరుచుకుపడుతున్నారని దుయ్యబట్టారు. ఐకమత్యంగా పోరాట స్ఫూర్తితో వైసీపీ ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫేక్ సమాచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏ ఆత్మ చెప్పిందో కానీ మావిగన్ అంటూ జగన్ అండ్ కో కలవరిస్తున్నారని లోకేశ్ సెటైర్లు వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై ముందస్తు చర్చలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు
వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News