Share News

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు లోకేశ్, అనిత

ABN , Publish Date - Nov 08 , 2026 | 07:52 AM

వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ మంత్రులు నారా లోకేశ్, అనిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు లోకేశ్, అనిత
Diwali Wishes

అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ ఏపీ మంత్రులు నారా లోకేశ్, అనిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు పోస్టు పెట్టారు.

లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలగాలి: లోకేశ్

వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు. ఆరోగ్యం ఆయుష్షుగా, ఆనందం చిరునవ్వుగా తలపెట్టే పనుల్లో విజయం కలగాలని ఆకాంక్షించారు.


ఇంటిల్లిపాదీ సంతోషంగా, సురక్షితంగా, భక్తిశ్రద్ధలతో దీపావళి పండుగను జరుపుకోవాలని లోకేశ్ కోరుకున్నారు. ఈ పండుగతో ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో దీపావళి వేడుకలు జరుపుకోవాలని అభిలాషించారు. అందరి జీవితాల్లో విజయదీపాలు వెలగాలని కోరుకున్నారు. సురక్షితంగా దీపావళి నిర్వహించుకుందామని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.


విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను చేసుకుంటాం: హోం మంత్రి అనిత

ప్రజలందరికీ దీపావళి పర్వదినం సందర్భంగా ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అనిత పోస్టు పెట్టారు. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకున్నారు.


మనం వెలిగించే ప్రతి దీపం మన ఇంటికే కాకుండా సమాజానికి కూడా వెలుగునివ్వాలని అనిత అన్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా పండుగను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. వెలుగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు, అభివృద్ధిని తీసుకురావాలని హోం మంత్రి అనిత ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 08:26 AM