Share News

జగన్ అండ్ కో అవినీతి, అక్రమాలపై వెబ్‌సిరీస్ తీస్తే అంతం ఉండదు: మంత్రి

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:49 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అండ్ కో అవినీతి, అక్రమాలపై వెబ్‌సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదని ఎద్దేవా చేశారు.

జగన్ అండ్ కో అవినీతి, అక్రమాలపై వెబ్‌సిరీస్ తీస్తే అంతం ఉండదు: మంత్రి
AP Minister Kollu Ravindra

అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి):: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అండ్ కో అవినీతి, అక్రమాలపై వెబ్‌సిరీస్ తీస్తే దానికి అంతం ఉండదని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డితో పాటు ఆయన చుట్టూ ఉన్న వారి అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోందని పేర్కొన్నారు. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సూట్‌కేస్ కంపెనీలను ఆయన సృష్టించారని ధ్వజమెత్తారు. ఈరోజు (సోమవారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. గతంలో సీఎంవోలో కీలకంగా పనిచేసిన వ్యక్తుల వద్ద రూ.వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి..? అని ప్రశ్నించారు.


వందల కోట్ల ఆస్తులు ఎక్కడివి..?..

కేవలం రూ.2 లక్షల జీతం తీసుకునే వారికి భార్యలు, బంధువుల పేరున వందల కోట్ల ఆస్తులు ఎక్కడివి..? అని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు. టిఫిన్ బండి నడిపిన వ్యక్తికి రూ.వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలు గమనించాలని అన్నారు. మద్యం, మైనింగ్, భూముల దోపిడీ ద్వారా ప్రజాధనాన్ని విదేశాలకు జగన్ అండ్ కో తరలించారని ఆరోపించారు. దోచుకున్న సొమ్మును సౌతాఫ్రికా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, మలేషియా దేశాల్లో పెట్టుబడులుగా పెట్టారని మండిపడ్డారు. విదేశాలకు తరలించిన డబ్బును సాఫ్ట్‌వేర్ కంపెనీల పేరుతో మళ్లీ వెనక్కు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు.


ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు..

'జే బ్రాండ్స్' మద్యంతో 30 వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లును తెంపారని మంత్రి దుయ్యబట్టారు. నాసిరకం మద్యం వల్ల కిడ్నీ, లివర్ వ్యాధులతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. సొంత తల్లిని, చెల్లిని జగన్ ఇంట్లోంచి పంపేశారని ఆగ్రహించారు. గతంలో ఓబులాపురం గనుల విషయంలో తాము చెప్పినట్లుగానే నేడు జడ్జిమెంట్ వచ్చిందని ప్రస్తావించారు. ప్రజల ఆగ్రహం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేకనే మాపై జగన్ అండ్ కో అసత్య ఆరోపణలు: మంత్రి జనార్దన్ రెడ్డి

వాయుగుండం ప్రభావం.. ఏపీకి భారీ వర్ష సూచన

అంతర్జాతీయ వేదికపై ఏపీ ఖ్యాతిని జ్యోతి యర్రాజీ చాటారు: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:44 PM