అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖను అప్రమత్తం చేసిన మంత్రులు అనిత, గొట్టిపాటి
ABN , Publish Date - Oct 25 , 2026 | 03:18 PM
అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖను ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్ అప్రమత్తం చేశారు. డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖను ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్ అప్రమత్తం చేశారు. డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు, జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు ఈరోజు (ఆదివారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు విద్యుత్ అధికారులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు.
వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలి..
విద్యుత్ సమస్యలు తలెత్తితే.. వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రులు సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ శాఖలో జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులంతా అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇతర శాఖలతో విద్యుత్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను వెంటనే తొలగించాలని మార్గనిర్దేశం చేశారు.
విద్యుత్ సమస్యలుంటే 1912 నంబర్‌కు ప్రజలు సమాచారం అందించాలి..
25 వేల స్తంభాలను, ఇతర సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేసినట్లు అధికారులు.. మంత్రులకు వెల్లడించారు. తుఫాన్ తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలకు అదనపు సిబ్బందిని పంపేందుకు SPDCL సన్నద్ధం కావాలని ఆదేశించారు. తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. కిందపడిన కరెంట్ వైర్లు, స్తంభాల దగ్గర ప్రజలు జాగ్రత్త వహించాలని మార్గనిర్దేశం చేశారు. విద్యుత్ సమస్యలుంటే 1912 నంబర్‌కు ప్రజలు సమాచారం అందించాలని మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ కోరారు.ః
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
కర్నూలు నగర అభివృద్ధి కోసం స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News