Share News

తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 24 , 2026 | 08:02 PM

బంగాళాఖాతంలో తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులను ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. మత్స్యకారుల ప్రాణరక్షణే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు.

తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
AP Minister Kinjarapu Atchannaidu

అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తుఫాన్ ముప్పు నేపథ్యంలో అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister Kinjarapu Atchannaidu) అప్రమత్తం చేశారు. మత్స్యకారుల ప్రాణరక్షణే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) మత్స్యశాఖ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి తుఫాన్‌ పరిస్థితులపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇంకా సముద్రంలోనే ఉన్న 91 బోట్లు.. తక్షణమే వారిని తీరానికి చేర్చాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.


మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావాలి..

తీరానికి చేరుకున్న 29,952 మత్స్యకార బోట్లు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బోట్ల సంఖ్య 30,043 ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సముద్రంలో ఉన్న 91 బోట్లలో 72 మెకనైజ్డ్, 19 మోటరైజ్డ్ బోట్లు ఉన్నట్లు గుర్తించామని అన్నారు. సముద్రంలో ఉన్న బోట్లలో విశాఖపట్నం-37, బాపట్ల-32, కృష్ణా-20, కాకినాడ-1, అనకాపల్లిలో ఒక బోటు ఉందని వెల్లడించారు. కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసుల సమన్వయంతో మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావాలని మార్గనిర్దేశం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అన్ని తీరప్రాంత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని హుకుం జారీ చేశారు.


రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి..

భారీ వర్షాల సూచనతో రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. కోత దశలో ఉన్న పంటలు, కోసిన ధాన్యం తడవకుండా సురక్షిత ప్రాంతాలకు అన్నదాతలు తరలించాలని సూచించారు. పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తుగా కాలువలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గాలుల తీవ్రతకు నేలకొరగకుండా అరటి, బొప్పాయి తోటలకు సరైన ఆధారాలు ఏర్పాటు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆక్వా రైతులు చెరువుల గట్లు, నీటి పారుదల వ్యవస్థలు, విద్యుత్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతన్నలకు సాంకేతిక సూచనలు ఇవ్వాలని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 08:45 PM