Share News

స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 03:31 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ నేతల ఫేక్ ప్రచారాలు బయటపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో హోరాహోరీగా నామినేషన్లు దాఖలవుతున్నాయని అసత్యపు ప్రచారాలకు ఫ్యాన్ పార్టీ కేడర్ దిగుతున్నారు.

స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై  వైసీపీ ఫేక్ ప్రచారాలు
AP Local Body Elections

అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ నేతల ఫేక్ ప్రచారాలు బయటపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో హోరాహోరీగా నామినేషన్లు దాఖలవుతున్నాయని అసత్యపు ప్రచారాలకు ఫ్యాన్ పార్టీ కేడర్ దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసినట్లు వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 32,095 నామినేషన్లు దాఖలైనట్లు వైసీపీ నేతలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. మొత్తం 15,017 నామినేషన్లను టీడీపీ అభ్యర్థులు దాఖలు వేశారు. ఇప్పటికీ 12,419 నామినేషన్లను వైసీపీ అభ్యర్థులు దాఖలు చేశారు. జనసేన పార్టీ తరపున 2073 మంది నామినేషన్లను దాఖలు చేశారు. బీజేపీ నుంచి 562 నామినేషన్లు దాఖలయ్యాయి. 28 జిల్లాల్లో 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 2805 నామినేషన్లు దాఖలు అయ్యాయి.


వైసీపీ నుంచి 1092 మంది నామినేషన్లు వేశారు. తెలుగుదేశం పార్టీ తరపున 1055 నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేన పార్టీ నుంచి 178, బీజేపీ తరపున 111 నామినేషన్లు దాఖలయ్యాయి. 2020లో జరిగిన పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవలైన విషయం తెలిసిందే. నాడు జరిగిన పట్టణ స్థానిక సంస్థల్లో 20.72 శాతం ఏకగ్రీవాలను వైసీపీ చేసుకుంది. జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన గ్రామీణ స్థానిక సంస్థల్లో 24 శాతం మేర ఎంపీటీసీ స్థానాలు, 19 శాతం మేర జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా బలవంతంగా చేజిక్కించుకున్నారు. వైసీపీ నేతల విధ్వంసాలు, దాడులతో గొడవలను సృష్టించి ఏకగ్రీవం చేసుకుని విజయం సాధించామని నాడు జగన్ అండ్ కో ప్రకటించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...

భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 23 , 2026 | 04:16 PM