ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:16 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 22వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఎస్ఐపీబీ సమావేశానికి వర్చువల్‌గా మంత్రులు లోకేశ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ, కందుల దుర్గేశ్ హాజరయ్యారు.
అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన 22వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఈరోజు (గురువారం) రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఎస్ఐపీబీ సమావేశానికి వర్చువల్‌గా మంత్రులు లోకేశ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయణ, కందుల దుర్గేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు, ఇంధన శాఖ, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో వివిధ పెట్టుబడి ప్రతిపాదనలపై ఎస్ఐపీబీలో అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు పెట్టుబడులుగా మారి ఉత్పత్తి ప్రారంభించే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మొత్తం 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టులకు సంబంధించి కార్యాచరణ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. పెట్టుబడుల సదస్సు నిర్వహించేందుకు వీలుగా విశాఖపట్నంలో ఓ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటయ్యేలా చూడాలని ఆదేశించారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు కీలకమని సీఎం మార్గనిర్దేశం చేశారు. లాజిస్టిక్స్ హబ్‌లో భాగంగా పోర్టులు, ఎయిర్ పోర్టులతో పాటు ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీపై దృష్టి పెట్టాలని సూచించారు. సెమీ కండక్టర్ రంగంలో తయారీ యూనిట్లతో కూడిన ఎకోసిస్టం రాష్ట్రంలో ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి...
విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం
నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక
Read Latest AP News And Telugu News