Share News

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...

ABN , Publish Date - Oct 22 , 2026 | 06:27 PM

ఆంధ్రప్రదేశ్‌లో 2026 -2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఈరోజు (గురువారం) విడుదలైంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి/ మార్చి -2027 వార్షిక పరీక్షల టైమ్‌టేబు‌ల్‌ను ప్రకటించింది.

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్..  వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...
AP Inter Public Exams

అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో 2026 -2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (AP Inter Public Exams) షెడ్యూల్ ఈరోజు (గురువారం) విడుదలైంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి/ మార్చి -2027 వార్షిక పరీక్షల టైమ్‌టేబు‌ల్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించనుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ సెక్రటరీ రంజిత్ బాషా ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు.


ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించనుంది. జనవరి 27వ తేదీన ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలు జరగనున్నాయి. జనవరి 29వ తేదీన ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను నిర్వహించనుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జనరల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.


ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించనుంది. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9:00 నుంచి 12:00, మధ్యాహ్నం 2:00 నుంచి 5:00 గంటల వరకు రెండు సెషన్లలో (ఆదివారాలతో సహా) నిర్వహించనుంది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇవే తేదీలు వర్తిస్తాయని, వారి టైమ్‌టేబుల్ విడిగా జారీ చేస్తామని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ రంజిత్ బాషా తెలిపారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం

నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 22 , 2026 | 08:49 PM