బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
ABN , Publish Date - Oct 23 , 2026 | 09:39 AM
తూర్పు మధ్య-ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా, ఎల్లుండికి తీవ్రవాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వెల్లడించారు.
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తూర్పు మధ్య - ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా, ఎల్లుండికి తీవ్రవాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వెల్లడించారు. సోమవారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఆ తదుపరి 2 రోజుల్లో ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరాల వైపు తీవ్రవాయుగుండం కదిలే సూచనలు ఉన్నాయని ప్రఖర్ జైన్ వివరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతాంగం ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...
భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News