Share News

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 03:33 PM

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా మరో కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుందని తెలిపింది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
AP Election Commission

అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా మరో కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 5 గంటలతో ముగియనుందని తెలిపారు. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు తమను నామినేషన్లు దాఖలు చేయకుండా ఎవరైనా అడ్డుకున్నారా అనే ఫిర్యాదులను వెంటనే పరిశీలించాలని ఆదేశించారు.


ఈ ఫిర్యాదుల విషయంలో అధికారులు వెంటనే ఫిర్యాదుదారులను ఫోన్‌లో సంప్రదించాలని ఏపీ ఎస్‌ఈసీ అన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులతో నామినేషన్ దాఖలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ విధానానికి అనుగుణంగా సమర్పించిన నామినేషన్లను స్వీకరించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించాలని అన్నారు. నామినేషన్ల కేంద్రానికి వెళ్లేందుకు అవసరమైన ప్రాంతాల్లో అభ్యర్థులకు వ్యక్తిగత భద్రత కల్పించాలని ఆదేశించారు. నామినేషన్లు వేసేందుకు అవసరమైన ప్రశాంత వాతావరణం కూడా కల్పించాలని ఏపీ ఎస్‌ఈసీ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో పెట్టుబడులే కాదు.. ఉత్పత్తి కూడా ప్రారంభించాలి: సీఎం చంద్రబాబు

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. వార్షిక పరీక్షల పూర్తి షెడ్యూల్ వివరాలివే...

భవానీ భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 23 , 2026 | 04:19 PM