Share News

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Oct 24 , 2026 | 08:51 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు భేటీ..  కీలక అంశాలపై చర్చ
AP CM Chandrababu Naidu

ఢిల్లీ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (శనివారం) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అలాగే, పలువురు కేంద్రమంత్రులను ఆయన కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సమావేశం అయ్యారు. ఏపీ అభివృద్ధికి సహకారం, రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. దాదాపు అరగంటపాటు ఈ సమావేశం కొనసాగింది.


సీఎం చంద్రబాబుతో అశ్వినీ వైష్ణవ్‌ భేటీ..

సీఎం చంద్రబాబుతో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్లు, రైల్వేశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం వన్ జనపథ్‌లో చంద్రబాబుతో అశ్వినీ వైష్ణవ్‌ సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు మాట్లాడారు.

అలాగే, వన్ జనపథ్‌లో ఓ శుభకార్యంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. రేపు ఉదయం 11:30లకు విజయవాడకు ఆయన చేరుకోనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 09:13 PM