కర్నూలు నగర అభివృద్ధి కోసం స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: మంత్రి టీజీ భరత్
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:49 PM
స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు నగర అభివృద్ధి కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు అవసరమని వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లా, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ (AP Minister TG Bharath) కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు నగర అభివృద్ధి కొనసాగాలంటే ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు అవసరమని వ్యాఖ్యానించారు. ఈరోజు (శనివారం) కర్నూలులో మంత్రి టీజీ భరత్ సైకిల్ యాత్ర నిర్వహించారు. 57, 59, 60, 55, 56వ వార్డుల్లో సైకిల్‌పై ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి కర్నూలు మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూశకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి ఓటు వేస్తే.. అభివృద్ధికి మద్దతు ఇచ్చినట్లు అని అన్నారు.
ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి టీజీ భరత్ కోరారు. తమ ప్రభుత్వంలో కర్నూలు వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. ఓర్వకల్లుకు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెప్పుకొచ్చారు. పెట్టుబడులతో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.పెట్టుబడులతో కర్నూలు జిల్లా రూపురేఖలు మారనున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News