జగన్‌కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:45 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదని ధ్వజమెత్తారు.
అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదని ధ్వజమెత్తారు. ఈరోజు (శుక్రవారం) మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్‌చాట్ చేశారు. వైసీపీ నేతలు ‘సర్’పై కోర్టుకెళ్లారని అన్నారు. స్థానిక ఎన్నికలు జాప్యం జరిగే కొద్ది అధికార పార్టీకి నష్టం కలుగుతుందనే ఆశ వైసీపీకి ఉందని ఎద్దేవా చేశారు.
ఆ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగడమే మేలు..
తమ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని జగన్ అండ్ కో భావిస్తున్నారని సీఎం అన్నారు. పట్టణ, స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగడమే మేలని చెప్పుకొచ్చారు. అప్పుడే రాజకీయ స్థిరత్వానికి నాంది పలుకుతామని వెల్లడించారు. మరో పవర్ సెంటర్ అనేది కరెక్ట్ కాదని.. నేతలు కలిసి పనిచేసుకోవాలని సూచించారు. ఆది సంస్థాగతంగా కూడా మంచిదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం..
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమనేది చట్టపరమైన రక్షణ మాత్రమేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి ఎన్నికల్లో కూడా బీసీలకు తాము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ‘సర్’ తుది జాబితా కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడూ ప్రకటించిన ఆది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే స్థానిక ఎన్నికలకు అడ్డుకాదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్.. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎప్పుడైనా ప్రకటించవచ్చని అన్నారు.
వెలిగొండ ప్రారంభం ఓ చరిత్ర..
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం ఓ చరిత్ర అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. 30 ఏళ్లు క్రితం తానే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశానని.. ఇప్పుడు తానే ప్రారంభిస్తున్నానని వ్యాఖ్యానించారు. తాను ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని నెరవేర్చానని అన్నారు. మార్కాపురం జిల్లా ప్రకటించానని ప్రస్తావించారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశానని... మొదటి దశను ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. అదేవిధంగా వెలిగొండ ప్రారంభంతో పాటు హార్టీకల్చర్ హబ్‌గా మార్చామని చెప్పారు. పోలవరం నుంచి తొలిదశలో అనకాపల్లి వరకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. రెండో దశలో వచ్చే ఏడాది విశాఖపట్నం వరకు నీటిని తీసుకెళ్తామని వివరించారు. పోలవరం కూడా వచ్చే ఏడాది ప్రారంభిస్తామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్, మార్కాపురంతో ఆ ప్రాంతంలో ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి సానుకూలత వ్యక్తం అవుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే ఇలానే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
డంపింగ్ యార్డ్ రహిత మున్సిపాలిటీలుగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ
నేపాల్ వరదలు.. ఏపీ వాసులు గల్లంతు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News