Share News

నేపాల్ వరదలు.. ఏపీ వాసులు గల్లంతు

ABN , Publish Date - Aug 28 , 2026 | 03:17 PM

నేపాల్‌‌లో పలు ప్రాంతాల్లో వచ్చిన వరదల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు గల్లంతయ్యారు. వారిలో.. పార్వతీపురానికి చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతైంది. అలాగే, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన చొప్పరపు రమేశ్ కూడా గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

 నేపాల్ వరదలు.. ఏపీ వాసులు గల్లంతు
Nepal Floods

అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): నేపాల్‌‌లో పలు ప్రాంతాల్లో వచ్చిన వరదల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు గల్లంతయ్యారు. వారిలో.. పార్వతీపురానికి చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతైంది. అలాగే, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన చొప్పరపు రమేశ్ కూడా గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.


పార్వతీపురానికి చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతు..

నేపాల్ వరదల్లో పార్వతీపురానికి చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతైంది. పండా వీధికి చెందిన సంతోశ్ కుమార్ సాహు(47), అతని భార్య సురభి (43), కుమారుడు స్పందన్ (18), కుమార్తె షైనా సాహు(13) గల్లంతయ్యారు. ఇంగ్లాడ్ నుంచి విహార యాత్ర కోసం మానస సరోవరానికి సంతోశ్ కుమార్ సాహు కుటుంబం వెళ్లింది. వారు తిరుగు ప్రయాణంలో వంతెనపై వెళ్తుండగా ఆకస్మాత్తుగా వచ్చిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ మేరకు బ్రిటన్ విదేశీ రాయబారికి సాహు కుటుంబం గల్లంతైన సమాచారం అందింది. అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.


కైలాసగిరి యాత్రకు వెళ్లిన కృష్ణాజిల్లా వాసి గల్లంతు

నేపాల్ వరదల్లో చిక్కుకుని కృష్ణాజిల్లా వాసి గల్లంతయ్యారు. గత 15 ఏళ్లుగా ఖతార్ దేశం దోహాలో పెనమలూరు మండలం కానూరుకు చెందిన చొప్పరపు రమేశ్ (53) ఉంటున్నారు. దోహాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఆయన పని చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ఖతార్ నుంచి నేపాల్‌.. కైలాసగిరి యాత్రకు రమేశ్ వెళ్లారు. అక్కడ ఆకస్మాత్తుగా వచ్చిన వరదల్లో రమేశ్ ఆచూకీ గల్లంతైంది. ఆయన గల్లంతవడంపై కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పందించారు. నేపాల్‌లో గల్లంతైన వారిలో కృష్ణా జిల్లాకు చెందిన రమేశ్ కూడా ఉన్నారని తెలిపారు. భారత ప్రభుత్వం ద్వారా రమేశ్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

ఏపీకి భారీ ప్రాజెక్ట్.. మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా అవతరణ

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 03:50 PM