Share News

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Aug 28 , 2026 | 01:04 PM

ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతలను స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు.

 ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ
Naga babu

అమరావతి, ఆగస్టు 28: ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతలను స్వీకరించారు. ఈరోజు(శుక్రవారం) మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు చేపట్టారు. నాగబాబుకి వేదపండితులు వేదఆశీర్వచనం అందించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నాగబాబుకు కీలక బాధ్యతలను అప్పగించారు.


ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదాను కల్పించింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబుని పీసీసీఎఫ్ పి.వి.చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ చీఫ్ రాహుల్ పాండే, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎన్.నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు వై.శ్రీనివాసరెడ్డి, పీసీసీఎఫ్ విజిలెన్స్ శరేవతి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్ బి.ఎన్.ఎన్.మూర్తి, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ వెంకటకృష్ణ, ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, తూర్పుకాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పాలవలస యశస్వి, పొల్యూషన్ కంట్రోట్ బోర్డు మెంబర్ పంచకర్ల సందీప్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


నాగబాబుకు పవన్ శుభాకాంక్షలు..

ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాగబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ-గ్రీన్ సంకల్పాన్ని నాగబాబు సమర్థంగా అమలు చేయాలని ‘ఎక్స్’ వేదికగా ఆకాంక్షించారు. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతాన్ని పచ్చదనంతో నింపే బృహత్ కార్యాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్లనున్నారని పవన్ పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఒంగోలులో లోకేశ్ పర్యటన.. రాడిసన్ 5 స్టార్‌ హోటల్‌కు శంకుస్థాపన

ఏపీకి భారీ ప్రాజెక్ట్.. మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా అవతరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 01:27 PM