ఏపీకి భారీ ప్రాజెక్ట్.. మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా అవతరణ
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:44 PM
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ డిజిటల్ ప్రాజెక్ట్ దక్కింది. ముంబై, చెన్నై తర్వాత దేశంలో మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా ఏపీ అవతరించనుంది.
అమరావతి, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ డిజిటల్ ప్రాజెక్ట్ దక్కింది. ముంబై, చెన్నై తర్వాత దేశంలో మూడో అతిపెద్ద డిజిటల్ ల్యాండింగ్ హబ్‌గా ఏపీ అవతరించనుంది. సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ నిర్మాణంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు భాగస్వామ్యం కానున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌తో పాటు AI ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది. మైక్రోసాఫ్ట్, లైట్‌స్టార్మ్, సింగ్‌టెల్ భాగస్వామ్యంతో సుమారు 3,600 కిలోమీటర్ల పొడవైన I-2SEA సముద్రగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేబుల్ ద్వారా విశాఖపట్నానికి సింగపూర్, ఆగ్నేయాసియా ప్రాంతాలతో నేరుగా కనెక్టివిటీ ఏర్పడనుంది. 2029 ఆఖరు నాటికి మైక్రోసాఫ్ట్-లైట్‌స్టార్మ్ సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది.
మచిలీపట్నం–హైదరాబాద్–ముంబై, చెన్నై–హైదరాబాద్–ముంబై మార్గాల్లో కొత్త అంతర్గత డిజిటల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నారు. దీంతో విశాఖపట్నం అంతర్జాతీయ డిజిటల్ గేట్‌వేగా మారే అవకాశం ఉంది. విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ ‘అమెరికా–ఇండియా కనెక్ట్’ సబ్‌సీ కేబుల్‌ను ఏర్పాటు చేయనుంది. విశాఖ గూగుల్ సెంటర్‌లో పవర్-హంగ్రీ AI మోడల్స్ కంటే AI ఇన్ఫరెన్సింగ్, క్లౌడ్ సేవలకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖ ఫెసిలిటీలో పునరుత్పాదక విద్యుత్, ఎయిర్ కూలింగ్ టెక్నాలజీలను గూగుల్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న రాజకీయ అశాంతి నేపథ్యంలో సురక్షిత డిజిటల్ కారిడార్‌గా భారత తూర్పు తీరం రూపుదిద్దుకోనుంది.
ఇవి కూడా చదవండి..
కాలుష్యంపై కృష్ణంపాలెం గ్రామస్థుల విజ్ఞప్తి.. డిప్యూటీ సీఎం తక్షణ స్పందన
ఒంగోలులో లోకేశ్ పర్యటన.. రాడిసన్ 5 స్టార్ హోటల్‌కు శంకుస్థాపన
Read Latest AP News And Telugu News