Share News

సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

ABN , Publish Date - Jun 17 , 2026 | 07:12 PM

సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ క్రమంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు.

సాయికృష్ణ ఘటనపై సీఐ నాగరాజు సస్పెండ్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
AP CM Chandrababu Naidu

అమరావతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆదేశించారు. ఈ క్రమంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తునకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు (బుధవారం) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.


సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే పోలీస్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి సచివాలయానికి పిలిపించుకుని ఈ ఘటనపై మాట్లాడారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎంతో కలిసి సమీక్షించారు సీఎం చంద్రబాబు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎంకు, డిప్యూటీ సీఎంకు వివరించారు పోలీస్ ఉన్నతాధికారులు. సాయికృష్ణ ఘటనపై నిష్పాక్షపాతంగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు. ఈ సమీక్షలో సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్రలడ్డా, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సింగపూర్ తర్వాత పెట్టుబడులకు ఏపీనే ఉత్తమ గమ్యస్థానం: సీఎం చంద్రబాబు

మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా దూసుకెళ్తోంది: ప్రహ్లాద్ జోషి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 07:17 PM