Share News

అన్నమయ్య జిల్లాలో వైసీపీ దౌర్జన్యాలు.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ABN , Publish Date - Nov 16 , 2026 | 08:19 PM

అన్నమయ్య జిల్లా యర్రంరెడ్డిగారిపల్లెలో వైసీపీ శ్రేణుల దాష్టికాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు సోమవారం ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలోనే టీడీపీ నాయకులపై వైసీపీ కేడర్ దాడి చేశారని ఆరోపించారు.

అన్నమయ్య జిల్లాలో వైసీపీ దౌర్జన్యాలు.. ఈసీకి టీడీపీ ఫిర్యాదు
Ashok Babu

అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా యర్రంరెడ్డిగారిపల్లెలో వైసీపీ శ్రేణుల దాష్టికాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు ఈరోజు (సోమవారం) ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలోనే టీడీపీ నాయకులపై వైసీపీ కేడర్ దాడి చేసిందని ఆరోపించారు.


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారమే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు గుండాగిరి చేస్తున్నారని ధ్వజమెత్తారు. నామినేషన్‌కు వెళ్తున్న టీడీపీ శ్రేణులను అడ్డగించి దాడి చేయడం హేయమైన చర్య అని ఆగ్రహించారు. వైసీపీ నాయకులకు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ వారి దాష్టికాలు పెరిగిపోతున్నాయని అశోక్ బాబు ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేకనే మాపై జగన్ అండ్ కో అసత్య ఆరోపణలు: మంత్రి జనార్దన్ రెడ్డి

వాయుగుండం ప్రభావం.. ఏపీకి భారీ వర్ష సూచన

అంతర్జాతీయ వేదికపై ఏపీ ఖ్యాతిని జ్యోతి యర్రాజీ చాటారు: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 09:20 PM