Share News

స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కును వైసీపీ కోల్పోయింది: మంత్రి సవిత

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:09 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కును వైసీపీ కోల్పోయింది: మంత్రి సవిత
AP Minister Savitha

శ్రీ సత్యసాయి జిల్లా, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సవిత (AP Minister Savitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (ఆదివారం) శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సవిత పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని వెల్లడించారు.


జగన్ హయాంలోని ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్లలో చేసి చూపించిందని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కును కూడా వైసీపీ కోల్పోయిందని విమర్శించారు. రాష్ట్రాన్ని తాము అభివృద్ధి చేసి ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నామని చెప్పుకొచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉందని వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం క్లీన్‌స్వీప్ చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ విజయానికి పునాది అని తెలిపారు. ప్రజాతీర్పుతో మరోసారి కూటమి సత్తా చాటబోతోందని మంత్రి సవిత పేర్కొన్నారు.


స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తున్నాం: పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasa Rao

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తున్నామని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మూడు పార్టీల నాయకులు కలిసి ఈ ఎన్నికల్లో సమన్వయంతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఈరోజు (ఆదివారం) విశాఖపట్నంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని ఉద్ఘాటించారు.


కొంతమంది త్యాగాలు చేయాలని.. మరికొంతమందికి అవకాశాలు వస్తాయని పల్లా శ్రీనివాసరావు వివరించారు. స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా తమకు పాజిటివ్ ఫలితాలు వస్తాయని అనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం మేయర్‌గా ముక్కా శ్రావణి తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలపై వైసీపీ నేతలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికలు.. మేయర్ అభ్యర్థులపై ఉత్కంఠ.. సీఎం నిర్ణయంపై ఆసక్తి

రాయచోటి, పుంగనూరు ఘటనలపై నివేదిక కోరాం.. చర్యలు తీసుకుంటాం: ఏపీ ఎస్‌ఈసీ

రాయచోటిలో కిరాయి ముఠాలతో ప్రజలను భయపెట్టాలని చూసే ఊరుకోం.. వైసీపీపై మండిపల్లి ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 18 , 2026 | 05:29 PM