Minister Ponguleti: ఫిర్యాదుల అంశం.. స్పందించిన మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Oct 13 , 2025 | 07:20 PM
తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని తెలిపారు.
ములుగు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తన మీద సహచర మంత్రులు ఫిర్యాదు చేశారని నమ్మడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు. తాను అంటే ఏంటో అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. రూ.70 కోట్ల కాంట్రాక్టు కోసం తాపత్రయ పడే అంత అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. మేడారం (Medaram) ఆలయ మాస్టర్ ప్లాన్‌కి అనుగుణంగా రూ.211 కోట్ల నిధులని తమ ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు. ఇవాళ(సోమవారం) ములుగులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
మంత్రులు తన మీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏమి ఉందని ప్రశ్నించారు. మంత్రులు సీతక్క (Seethakka), కొండా సురేఖ (Konda Surekha) ఇద్దరూ సమ్మక్క - సారక్కలాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. భక్తుల భద్రత, రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఆధునికీకరణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. 90 రోజుల్లో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. మేడారం ఆలయ రాతి కట్టడాలకు కావాల్సిన గ్రానైట్‌ని పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నామని వివరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
శాశ్వత ప్రతిపాదికన పనులు చేస్తున్నామని తెలిపారు. ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు విఘాతం కలుగకుండా నిర్మాణాలు చేపట్టబోతున్నామని స్పష్టం చేశారు. గత మేడారం జాతరకు కోటిమంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. ఈసారి మేడారం జాతరకు భక్తుల సంఖ్య డబుల్ అవుతుందని.. ఇందుకు అనుగుణంగా అంచనాలు వేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులు సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ శివధర్ రెడ్డి
కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు
Read Latest Telangana News And Telugu News