KTR Complaint ON Election Commission: కాంగ్రెస్‌పై ఎన్నికల సంఘానికి కేటీఆర్ ఫిర్యాదు
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:29 PM
కాంగ్రెస్‌పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీఆర్కే భవన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాలని ప్రస్తావించారు కేటీఆర్.
హైదరాబాద్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ (Congress)పై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి (Telangana Election Commission) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఇవాళ(సోమవారం) బీఆర్కే భవన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు అంశాలని ప్రస్తావించారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక (Jubilee Hills Bypoll)లో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ నేతలు ప్రలోభపెడుతున్నారని, ఓటర్లను భయపెడుతున్నారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కేటీఆర్.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని ఆక్షేపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీ అవుతోందని అంటుంటే, జూబ్లీహిల్స్‌లో మాత్రం కాంగ్రెస్ నేతలే ఓటు చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 20 వేల దొంగ ఓట్లని సృష్టించారని ఫైర్ అయ్యారు. ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కొవ్వూరి కార్తీక్ పేరుతో మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని.. దీపక్ శర్మ అనే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్.
కింది స్థాయి అధికారులు కాంగ్రెస్‌తో కుమ్మక్కై దొంగ ఓట్లను సృష్టించారని మండిపడ్డారు. దొంగ ఓట్ల పైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైన కింది స్థాయి అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు 20 వేల దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులు సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ శివధర్ రెడ్డి
జువైనల్ హోంలో లైంగిక దాడిపై పోలీసులు ఏం తేల్చారంటే
Read Latest Telangana News And Telugu News