DGP Shivdhar Reddy: పోలీసులు సివిల్ పంచాయితీ చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ శివధర్ రెడ్డి
ABN , Publish Date - Oct 13 , 2025 | 03:36 PM
డిపార్ట్‌మెంట్‌లో లంచం తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. కేసుల విషయంలో బేసిక్ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీని వాడాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు.
హైదరాబాద్, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): పోలీస్ స్టేషన్‌లలో సివిల్ వివాదాలకు తావు లేదని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) స్పష్టం చేశారు. సివిల్ వివాదాల కోసం సివిల్ కోర్టులు ఉన్నాయని వివరించారు. పోలీస్ స్టేషన్ అడ్డాగా సివిల్ పంచాయితీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ రాష్ట్ర పోలీస్ సిబ్బందికి డీజీపీ శివధర్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలని డీజీపీ ప్రస్తావించారు.
యూనిఫాం, అవినీతి ఒకే దగ్గర ఉండవని తేల్చిచెప్పారు. ఒక్క పోలీస్ అధికారి అయినా లంచం తీసుకుంటే డిపార్ట్‌మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పుకొచ్చారు. డిపార్ట్‌మెంట్‌లో లంచం తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల భద్రత పోలీసు ప్రధాన బాధ్యత అని ఉద్ఘాటించారు. పోలీస్ సిబ్బంది వెల్ఫేర్ తన వ్యక్తిగత ప్రయారిటీ అని చెప్పుకొచ్చారు. ఫెయిర్ అండ్ ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్ పోలీసింగ్ తన ఫిలాసఫీ అని నొక్కిచెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి.
కేసుల విషయంలో బేసిక్ పోలీసింగ్‌తో పాటు టెక్నాలజీని వాడాలని సూచించారు. పేద ప్రజలు ఆపదలో ఉంటే పోలీసులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆపదలో ఆదుకున్న వాళ్లని పేదలు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతులతో కలిసి సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించిన సీఎం
జువైనల్ హోంలో లైంగిక దాడిపై పోలీసులు ఏం తేల్చారంటే
Read Latest Telangana News And Telugu News