Share News

Mahesh Goud Counter On BRS: హామీలు నెరవేరిస్తే బాకీ పడినట్లా.. బీఆర్ఎస్‌పై మహేష్ గౌడ్ ఫైర్

ABN , Publish Date - Sep 30 , 2025 | 01:01 PM

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జీవితాంతం బీసీల పేర్లతో ఓట్లు అడిగిన వారు ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

Mahesh Goud Counter On BRS: హామీలు నెరవేరిస్తే బాకీ పడినట్లా.. బీఆర్ఎస్‌పై మహేష్ గౌడ్ ఫైర్
Mahesh Kumar Goud Counter On BRS

హైదరాబాద్, సెప్టెంబరు30 (ఆంధ్రజ్యోతి): జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election)లో తామే గెలుస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలో మంచి మెజారిటీతో కాంగ్రెస్ (Congress) అభ్యర్థి గెలుస్తారని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నిక (Local Bodies Election)ల్లో 85 శాతం తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాల్జేశారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన బాకీలను తమ ప్రభుత్వం కడుతోందని చెప్పుకొచ్చారు. మిగులు తెలంగాణ రాష్ట్రాన్ని బాకీ రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతోందని ఎద్దేవా చేశారు. ఇవాళ(మంగళవారం) గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్.


బాకీ కార్డు అని బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) అంటుంటే జనాలు నవ్వుతున్నారని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం బాకీ పడినట్లా..? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే బాకీ పడినట్లా..? అని నిలదీశారు. తెలంగాణ ప్రజల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ (KCR) ప్రభుత్వమేనని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు చేస్తే ప్రజలు తిరుగబడతారని హెచ్చరించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి పదేళ్లు కాపురం చేశారని ఆక్షేపించారు. ఇప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉన్నాయని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నల వర్షం కురిపించారు.


ఎంపీ ఈటల రాజేందర్‌కి మహేష్ గౌడ్ కౌంటర్

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ (Etala Rajender)కి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జీవితాంతం బీసీల పేర్లతో ఓట్లు అడిగిన వారు ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ఎక్కడ ఆగిందో ఈటల రాజేందర్ చెప్పాలని నిలదీశారు. ఈటల రాజేందర్‌ తాను ముదిరాజ్ బిడ్డనని అంటారని.. ఇప్పుడు బీసీల కోసం ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్ అయ్యారు. బీసీల నోటి దగ్గర ముద్ద లాక్కుంటున్నా ఈటల, బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కలిసి కోర్టులో పిల్స్ వేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం, మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్...

డీజీపీ జితేందర్ కంటతడి... ఎందుకంటే

Read Latest Telangana News and National News

Updated Date - Sep 30 , 2025 | 01:15 PM