Non Veg Shops Closed On October 2nd: మద్యం, మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్...
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:05 AM
మద్యం, మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్. అక్టోబర్ 2వ తేదీన మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. ఈ మేరకు కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్, సెప్టెంబరు30 (ఆంధ్రజ్యోతి): మద్యం, మాంసం ప్రియులకు షాకింగ్ న్యూస్. అక్టోబర్ 2వ తేదీన మాంసం దుకాణాలు (Non Veg Shops) బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ (GHMC Commissioner RV Karnan). మహాత్మా గాంధీ జయంతి (Gandhi Jayanthi) సందర్భంగా మాంసం దుకాణాలు, స్లాటర్ హౌస్‌లను జీహెచ్ఎంసీ పరిధిలో మూసివేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. ఈ మేరకు కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
మహాత్మా గాంధీ జయంతికి మాంసం దుకాణాలు బంద్ చేయాలని జీహెచ్ఎంసీ యాక్ట్ 1955లోని 533B ప్రకారం స్టాండింగ్ కమిటీలో ఆమోదించారని గుర్తుచేశారు. సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులు పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా రావడంతో అయోమయంలో పడ్డారు మాంసం విక్రయదారులు.
మద్యం షాపులు బంద్..
మరోవైపు.. అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా మాంసం షాపులతో పాటు మద్యం షాపులను కూడా మూసివేస్తున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏడాది మహాత్మా గాంధీ జయంతికి తెలంగాణ వ్యాప్తంగా ఈ రూల్‌ను పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది మహాత్మా గాంధీ జయంతి, దసరా పండుగలు ఓకే రోజు వచ్చాయి. ఈ క్రమంలో మద్యం షాపులను ప్రభుత్వం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో దసరాను ఘనంగా చేసుకుంటారు. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై ఏం చేయాలా అనే ఆలోచనలో మద్యం, మాంసం ప్రియులు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. మరో గొప్ప పథకం ప్రారంభం
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ.. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ
Read Latest Telangana News and National News