TG GOVT ON Breakfast Scheme: గుడ్ న్యూస్.. మరో గొప్ప పథకం ప్రారంభం
ABN , Publish Date - Sep 29 , 2025 | 06:54 AM
తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. భాగ్యనగరంలో సోమవారం రూ.5లకే బ్రేక్‌ఫాస్ట్ పథకం అందుబాటులోకి వచ్చింది. మోతీనగర్, మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్‌లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి ప్రారంభించారు.
హైదరాబాద్, సెప్టెంబరు29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మరో శుభవార్త తెలిపింది. భాగ్యనగరంలో ఇవాళ(సోమవారం) రూ.5లకే బ్రేక్‌ఫాస్ట్ పథకం (Breakfast Scheme) అందుబాటులోకి వచ్చింది. మోతీనగర్, మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ (Indiramma Canteens)లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. తొలిదశలో 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆ తర్వాత భాగ్యనగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ. రోజుకూ 25 వేల మందికి మిల్లెట్ టిఫిన్స్ (Millet Tiffins) అందించనుంది. మెనూలో ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ ఉండనున్నాయి. ఒక్కో ప్లేట్‌కు రూ.19ల ఖర్చు అవుతుండగా... రూ. 14లను భరించనుంది జీహెచ్ఎంసీ. ఈ క్యాంటీన్లు వారానికి ఆరురోజులు కొనసాగుతుండగా.. ఆదివారం మాత్రం సెలవు ఉంటుంది. ఇప్పటికే 150 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రూ.5లకే మధ్యాహ్న భోజనం అందిస్తోంది బల్దియా.
తెలంగాణ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం దెబ్బతీసింది: మంత్రి పొన్నం ప్రభాకర్
మింట్ కాంపౌండ్‌లో ఐదు రూపాయలకే బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని కోలుకోలేని విధంగా గత కేసీఆర్ ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. అయిన తాము ఎవరినీ బద్నామ్ చేయాలని అనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అప్పుడు గరీబీ హటావో నినాదం ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు అందుకు అనుగుణంగా తమ ప్రభుత్వ పాలనా సాగుతోందని తెలిపారు. రూ.200 యూనిట్ల పవర్ ఇస్తున్నామని అన్నారు. ఐదు వందలకే గ్యాస్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు అమలు చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనిపించి ఆర్టీసీ అద్దెకు తీసుకునేలా ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదేళ్లల్లో ఇవ్వని ఉద్యోగాలను ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చాం
గురుకుల నిత్యావసర బిల్లుల పెండింగ్ సిగ్గుచేటు
Read Latest Telangana News and National News