Rare Snakes and Lizards Seized: పాములు, బల్లుల అక్రమ రవాణా
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:33 AM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ సరీసృపాల అక్రమ రవాణాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు...
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టివేత
శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ సరీసృపాల అక్రమ రవాణాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. నగరానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకాక్ నుంచి ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అతడి కదలికలపై అనుమానం వచ్చిన అధికారులు బ్యాగులను తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో విదేశీ సరీసృపాల జాతికి చెందిన అరుదైన పాములు, బల్లులు బయటపడ్డాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బాంబు బెదిరింపు మెయిల్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ సమాచారంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సీఐఎ్‌సఎఫ్, సీఆర్పీఎఫ్ ప్రత్యేక బలగాలు, బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో విమానాశ్రయంలోని అరైవల్స్, డిపార్చర్, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. చివరకు ఎలాంటి బాంబు లేదని భద్రతా బలగాలు నిర్ధారించాయి. కొంతకాలంగా విమానాశ్రయానికి ఇలాంటి వరుస బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని, వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియ్‌సగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.