Harish Rao VS Revanth Reddy: ఎన్నికల ముందు రజనీకాంత్.. తర్వాత గజినీకాంత్ .. రేవంత్‌పై హరీశ్‌రావు మాస్ సెటైర్లు
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:11 PM
రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. రేవంత్, మల్లు భట్టి విక్రమార్క బాండు పేపర్‌పై సంతకాలు పెట్టి ఎన్నికల హామీలిచ్చారని.. కానీ ఎన్నికల హామీలపై ఇప్పడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 27: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి (Revanth Reddy Govt) రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క బాండు పేపర్‌పై సంతకాలు పెట్టి ఎన్నికల హామీలు ఇచ్చారని.. కానీ ఎన్నికల హామీలపై ఇప్పడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు హరీశ్‌రావు.
కాంగ్రెస్ (Congress) బకాయి కార్డులను ఇంటింటికీ పంచుతామని చెప్పుకొచ్చారు. బాకీ కార్డు చూపించి ప్రజలు కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో కార్మికులు, వ్యవసాయ కార్మికులు సైతం మోసపోయారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి.. ఎన్నికల ముందు రజనీకాంత్.. ఎన్నికల తర్వాత గజినీకాంత్ మాదిరిగా మారిపోయారని ఎద్దేవా చేశారు హరీశ్‌రావు.
రేవంత్.. చీఫ్ మినిస్టర్ కాదు.. రేవంత్ రెడ్డి కటింగ్ మాస్టర్ అని సెటైర్లు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ చేసే పనిలో రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారని ఆక్షేపించారు. ఆరు గ్యారెంటీలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చిదామంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిపోయారని దెప్పిపొడిచారు. మార్పు మార్పు అంటూ ప్రజలను రేవంత్‌రెడ్డి ఏమార్చారని విమర్శించారు. ఎన్నికల ముందు గల్లీ గల్లీ తిరిగిన గాంధీలు.. ఇప్పుడు ఎక్కడ..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలు ప్రశ్నిస్తారని గాంధీలు హైదరాబాద్‌కు రాకుండా ముఖం చాటేశారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News and National News