Bandi Sanjay: తుపాకులు వీడి..పోలీసులకు లొంగిపోండి..బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - May 04 , 2025 | 12:25 PM
Bandi Sanjay: మావోయిస్టులకు బండి సంజయ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీనే నక్షలైట్లను నిషేధించిందని గుర్తుచేశారు.

కరీంనగర్: మావోయిస్టులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. నక్సలైట్ల చేతిలో తుపాకులు ఉన్నాయని చెప్పారు. నిషేధిత సంస్థలతో తాము చర్చలు జరపమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లు పోటీ పడి మరి నక్సలైట్లను సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. పోలీసులను, రిపోర్టర్లను చంపితే.. సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌లు ఎందుకు మాట్లాడలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇవాళ (ఆదివారం)కరీంగనర్‌లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీనే నక్షలైట్లను నిషేధించిందని బండి సంజయ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ కుల గణనకు, కేంద్రం కుల గుణనకు అసలు పోలికే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చేసిన సర్వే అంతా తప్పుల తడక అని విమర్శించారు. పహాల్గాం సమస్యను శాంతి భద్రతల కోణంలో చూడాలని అన్నారు. హిందూ ముస్లిం కోణంలో అసలు చూడొద్దని బండి సంజయ్ కుమార్ తెలిపారు.
కాగా.. కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ మధ్యలో ఉన్న కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్లు చేస్తోంది. ఈ చర్యలను సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం శాంతి సామరస్య పూర్వకంగా చర్చలు జరపాలని రేవంత్‌రెడ్డి, కేసీఆర్ కోరారు. ఈ మేరకు శాంతికమిటీతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరిపారు. అలాగే మాజీ మంత్రి జానారెడ్డితో సమావేశం అయి శాంతి చర్చల గురించి చర్చించారు. కేంద్ర కాంగ్రెస్ నేతలతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి
KTR: ప్రమాద బాధిత కుటుంబానికి కేటీఆర్ అండ
Ponnam Prabhakar: ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు పిలిచే చాన్స్
Ration Misuse: బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డు రద్దు
Read Latest Telangana News And Telugu News