Raghu Rama Fires YSRCP: పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:16 PM
పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ కోటి సంతకాలు చేసుకుంటారా.. లేదా ఐదు కోట్ల సంతకాలు చేసుకుంటారో వారి విచక్షణకే వదిలేస్తున్నామని రఘురామ విమర్శించారు.
విశాఖపట్నం, అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నానికి డేటా సెంటర్ (Visakhapatnam Data Center) రావడం వల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (Raghu Rama Krishnam Raju) వ్యాఖ్యానించారు. గూగుల్ డేటా సెంటర్‌తో ఏపీకి బూస్టప్ వస్తోందని చెప్పుకొచ్చారు. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వల్ల లక్షకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ డేటా సెంటర్ కారణంగా.. ఏపీకి పలు ఏఐ, ఐటీ ఆధారిత పరిశ్రమలు రావడం ఖాయమని ఉద్ఘాటించారు రఘురామ.
ఇవాళ(గురువారం) విశాఖపట్నంలో రఘురామ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డేటా సెంటర్‌తో మంచి జరుగకపోతే అంత గొంతు ఎందుకు చించుకుంటారు..? అని ప్రశ్నించారు. మెడికల్ కళాశాలల అంశంపై మంత్రి సత్యకుమార్ చాలా క్లారిటీ ఇచ్చారని గుర్తుచేశారు. పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదని.. 30 సంవత్సరాల తర్వాత ఇవి ప్రభుత్వపరం అవుతాయని స్పష్టం చేశారు రఘురామ.
జగన్ హయాంలో నిర్ణయించిన డొనేషన్ల సీట్ల సంఖ్య కంటే తక్కువగానే డొనేషన్ల సీట్ల సంఖ్య ఉండే విధంగా మెడికల్ కాలేజీల పీపీపీ మోడ్‌ని కూటమి ప్రభుత్వం రూపొందించిందని నొక్కిచెప్పారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ కోటి సంతకాలు చేసుకుంటారా..? లేదా ఐదు కోట్ల సంతకాలు చేసుకుంటారో వారి విచక్షణకే వదిలేస్తున్నామని విమర్శించారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి మరో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఉద్ఘాటించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తమ నియోజకవర్గంలో కూడా నెలకి రెండుసార్లు చెక్కులు పంపిణీ చేస్తామని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
Read Latest AP News And Telugu News