Share News

Kalisetti Fire On Jagan: కత్తులు పట్టేవాడికి కంప్యూటర్ ఏం తెలుసు.. జగన్‌పై ఎంపీ ఫైర్

ABN , Publish Date - Oct 23 , 2025 | 02:49 PM

విశాఖకు డేటా సెంటర్ రావడం జగన్‌కు ఇష్టం ఉందా లేదా చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు... చంద్రబాబును ఘోరంగా అవమానించారన్నారు.

Kalisetti Fire On Jagan: కత్తులు పట్టేవాడికి కంప్యూటర్ ఏం తెలుసు.. జగన్‌పై ఎంపీ ఫైర్
Kalisetti Fire On Jagan

విశాఖపట్నం, అక్టోబర్ 23: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (MP Kalisetti Appala Naidu) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల ఎమ్మెల్యే స్క్రిప్ట్‌ ప్రసంగం చూశామని... అన్నీ అవస్తవాలే మాట్లాడారని వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలతో పాటు దేశవిదేశాల్లో ఉన్న వారు తలదించుకునేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. జగన్ ఆన్‌పార్లమెంటరీ మాటలు మాట్లాడారని.. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విశాఖలో డేటా సెంటర్‌పై ఆయన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని మండిపడ్డారు. కత్తులు పట్టుకున్నవాడికి... కంప్యూటర్ కోసం ఏమి తెలుసని ప్రశ్నించారు. ‘డేటా సెంటర్‌కు మీరు శంకుస్థాపన చేస్తే... మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు’ అని ఎంపీ నిలదీశారు.


విశాఖకు డేటా సెంటర్ రావడం జగన్‌కు ఇష్టం ఉందా? లేదా?చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు... చంద్రబాబును ఘోరంగా అవమానించారన్నారు. జగన్‌లాగా వన్ టైమ్ సీఎం కాదని... చంద్రబాబు నాలుగు సార్లు సీఎం అయ్యారని తెలిపారు. హైదరాబాద్ అంటే గుర్తుకు వచ్చేది చంద్రబాబు అని అక్కడ అభివృద్ధి బాబు చలవే అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అటు బీఆర్‌ఎస్ నేతలు ఒప్పుకుంటున్నారని తెలిపారు. పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ నేతలు విశాఖను దోచుకున్నారని.. ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును చూసి ఏపీకి పెట్టుబడులు వస్తుంటే... రావద్దని జగన్ మోహన్ రెడ్డి, ఆయన టీమ్ మెయిల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. మద్యంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య

అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 23 , 2025 | 04:13 PM