Raghurama Slams Jagan: దాన్ని బట్టే వైసీపీ సభ్యుల అనర్హతపై నిర్ణయం: డిప్యూటీ స్పీకర్
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:38 PM
వచ్చే అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులను భట్టి వైసీపీ సభ్యులు అనర్హత పరిధిలోకి వస్తారా లేదా అనేది నిర్ణయం అవుతుందని వెల్లండించారు. 60 పనిదినాలు హాజరు కాకపోతే రాజ్యాంగం చెప్పినట్టు నడుచుకోవాలని స్పష్టం చేశారు.
విశాఖపట్నం, అక్టోబర్ 23: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు (Deputy Speaker Raghurama Krishnam Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణాత్మక చర్చ జరగాలంటే జగన్‌మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ సమావేశాలకు రావాలన్నారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడాలి తప్ప ఇంట్లో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం జగన్ మరో మూడున్నరేళ్లు ఆగాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడుగా జగన్ అసెంబ్లీలో ప్రజల అంశాలను ప్రస్తావించవచ్చని.. సబ్జెక్టును బట్టి వాళ్ళకు సమయం ఇస్తామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులను బట్టి వైసీపీ సభ్యులు అనర్హత పరిధిలోకి వస్తారా లేదా అనేది నిర్ణయం అవుతుందని వెల్లండించారు. 60 పనిదినాలు హాజరు కాకపోతే రాజ్యాంగం చెప్పినట్టు నడుచుకోవాలని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆఖరి రెండేళ్లు సభకు రాలేదని కొంత మంది మాట్లాడటం కరెక్ట్ కాదని డిప్యూటీ స్పీకర్ అన్నారు.
పవన్ కళ్యాణ్‌పై...
భీమవరం డీఎస్పీ వ్యవహారానికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ.. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని.. పవన్ ఫ్యాన్స్ తనను అపార్థం చేసుకున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీ పనితీరుపై తనకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని... .డిప్యూటీ సీఎంకు ఎటువంటి సమాచారం ఉందో తెలియదన్నారు. తన పరిధిలో ఉన్న డీఎస్పీ పనితీరు తనకు తెలుసు కనకనే సమర్థించినట్లు చెప్పుకొచ్చారు. భీమవరం సబ్ డివిజన్‌కు ఇటీవలే బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అవార్డు వచ్చిందన్నారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణల మీద తనకు వచ్చిన సమాచారం తప్పై ఉండవచ్చని... పవన్‌కు వచ్చిన ఫిర్యాదులు రైట్ అయి ఉండవచ్చన్నారు. విచారణలో అన్నీ తేలుతాయని చెప్పుకొచ్చారు. ‘ఆయన డిప్యూటీ సీఎం.... నేను డిప్యూటీ స్పీకర్ కనుక డిప్యూటీ కామన్ అనుకుంటున్నారు. ఆయన ఉపముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత....నేను డిప్యూటీ స్పీకర్ మాత్రమే. ఉండి ఎమ్మెల్యేగానే డీఎస్పీ ఇష్యూలో నేను స్పందించాను’ అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
Read Latest AP News And Telugu News