Share News

CM Chandrababu Heavy Rains: దుబాయ్‌లో ఉన్నా... భారీ వర్షాలపై సీఎం అలర్ట్

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:26 AM

వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో మాట్లాడారు సీఎం. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు.

CM Chandrababu Heavy Rains: దుబాయ్‌లో ఉన్నా... భారీ వర్షాలపై సీఎం అలర్ట్
CM Chandrababu Heavy Rains

అమరావతి, అక్టోబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu).. అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం సీఎం దుబాయ్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో భారీ వర్షాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తున్నారు సీఎం. తాజాగా భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో సీఎం మాట్లాడారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై మంత్రులు, సీఎస్, ఆర్టీజీ అధికారులతో మాట్లాడారు సీఎం. యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు.


వర్ష ప్రభావిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సీఎం సూచించారు. అంటువ్యాధులు వ్యాపించకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి..

తుని అత్యాచార నిందితుడు నారాయణరావు ఆత్మహత్య

అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 23 , 2025 | 11:35 AM