Rajahmundry Hostel Girl: రాజమండ్రిలో హాస్టల్ బాలికపై అత్యాచారం.. నిందితులు అరెస్ట్
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:49 PM
దీపావళి పండగ వేళ.. మందు గుండు సామాగ్రి కొనుగోలు చేసేందుకు సాంఘిక సంక్షేమ హాస్టల్ నుంచి బాలిక బయటకు వచ్చింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడితోపాటు అతడికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజమండ్రి,అక్టోబర్ 23: సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు పాము అజయ్‌తోపాటు అతని స్నేహితుడు కె. సత్యస్వరూప్‌ను అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు. గురువారం విలేకర్లతో ఆమె మాట్లాడుతూ.. నిందితుడు అజయ్ ఐటీఐ చదివాడని తెలిపారు. అతడు ఉత్సవాలు, ఊరేగింపుల్లో గారడీ డాన్సులు చేస్తుంటాడని వివరించారు. నిందితుడు అజయ్‌పై ఇప్పటికే ఆలమూరు పోలీసుస్టేషన్‌లో పలు కేసులు నమోదై ఉన్నాయన్నారు.
నిందితుడికి సహకరించిన సత్య స్వరూప్ రావులపాలెంలో సెలూన్ నడుపుతున్నాడని చెప్పారు. అక్టోబర్ 20వ తేది సాయంత్రం 5 గంటలకు దీపావళి వేడుకల కోసం క్రాకర్స్ కొనుక్కోవటానికి బాలిక హాస్టల్ నుంచి బయటకు వచ్చిందన్నారు. ఆ బాలికను బైక్‌పై నిందితులు రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జిలోకి తీసుకు వెళ్లారని పేర్కొన్నారు. అనంతరం ఆ బాలికపై అజయ్ అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. ఆ తర్వాత ఆమెను హాస్టల్ వద్ద దింపి వెళ్లిపోయారని చెప్పారు. ఈ కేసులో నిందితులపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ భవ్య కిషోర్ వివరించారు.
ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి గుయాజుద్దీన్ విచారణ జరిపి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. మరోవైపు రాజమండ్రి ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు సూచించామన్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆదుకోవాలంటూ మంత్రి లోకేశ్‌కు మహిళ వీడియో సందేశం..
నారాయణరావు మృతి.. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
For More AP News And Telugu News